జాబ్‌ మేళా రేపు

ABN , First Publish Date - 2022-08-15T05:36:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో చందు సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ నెల 16న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి సాయికృష్ట చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.

జాబ్‌ మేళా రేపు

మురళీనగర్‌, ఆగస్టు 14 :  ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో చందు సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ నెల 16న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి సాయికృష్ట చైతన్య  ఒక ప్రకటనలో తెలిపారు. పెందుర్తి ఆదర్శ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్టు తెలిపారు. 2017 నుంచి 2021-22 విద్యా సంవత్సరాల్లో బీటెక్‌ లేదా ఎంసీఏ పూర్తి చేసిన వారు ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 92925 53352 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు.


Read more