తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-12-13T00:43:04+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్‌చార్జి సూర్యచంద్ర డిమాండ్‌ చేశారు.

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి
తడిచిన వరి పొలాలను పరిశీలిస్తున్న జనసేన నాయకుడు

మాకవరపాలెం, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్‌చార్జి సూర్యచంద్ర డిమాండ్‌ చేశారు. సోమవారం జి.కోడూరులో వర్షాలకు తడిచిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి, నష్టపరిహారం జాబితాను కూడా తయారు చేయలేదన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకుంటే అందోళన చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు కర్రి సురేష్‌, నాయకులు సేనాపతి శేషు, సంతోష్‌, అచ్చియ్యనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:43:06+05:30 IST