జగన్‌రెడ్డి పాలనను విదేశాల్లో వెక్కిరిస్తున్నారు

ABN , First Publish Date - 2022-11-25T03:41:47+05:30 IST

జగన్‌రెడ్డి పాలనను చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

జగన్‌రెడ్డి పాలనను విదేశాల్లో వెక్కిరిస్తున్నారు

రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి పాలనను చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తానా పూర్వాధ్యక్షుడు సతీష్‌ వేమన అధ్యక్షతన వాషింగ్టన్‌ డీసీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అమెరికాలో కూడా చేపట్టాలన్నారు. తెలుగువారంటే దేశంలోనే కాదు.. అమెరికాలో కూడా గౌరవం ఉందని, జగన్మోహన్‌రెడ్డి అత్యాశతో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారి ప్రపంచవ్యాప్తంగా పరువు పోవడం ఖర్మ కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న వైసీపీ నాయకులు రేపటి నుంచి ప్రైవేటు ఆస్తులను దోచుకుంటారని ఆరోపించారు. ప్రవాసాంధ్రులు అప్రమత్తం కాకపోతే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలదన్నారు. జగన్‌రెడ్డి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక బారికేడ్లు దూకి పారిపోతున్నారని మన్నవ సుబ్బారావు తెలిపారు.

Updated Date - 2022-11-25T03:41:47+05:30 IST

Read more