-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Jagan Reddy insists to SEZ residents-NGTS-AndhraPradesh
-
సెజ్ నిర్వాసితులకు జగన్‌రెడ్డి మొండి చెయ్యి
ABN , First Publish Date - 2022-08-17T06:27:19+05:30 IST
అచ్యుతాపురం సెజ్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి చెయ్యి చూపించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పరిశ్రమలు ఎక్కడ స్థాపించినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని జగన్‌రెడ్డి చెప్పిన మాటలు వాస్తవరూపం దాల్చలేదన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ‘బుద్ద’
అనకాపల్లి అర్బన్, ఆగస్టు 16 : అచ్యుతాపురం సెజ్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి చెయ్యి చూపించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పరిశ్రమలు ఎక్కడ స్థాపించినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని జగన్‌రెడ్డి చెప్పిన మాటలు వాస్తవరూపం దాల్చలేదన్నారు. సెజ్‌లో 90 ఎకరాల్లో నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న ఏటీజీ టైర్ల కంపెనీలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వలేదని ఆరోపించారు. రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ 400 మందిని మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకున్నారన్నారు. వీరిలో 10శాతం మంది కూడా నిర్వాసితులు లేరన్నారు. పూడిమడక షిప్పింగ్ హార్బర్ కోసం స్థల పరిశీలన చేసి ఏడాదిన్నర పూర్తయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, పార్లమెంటు ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్నలక్ష్మి, శంకర్ల పద్మలత, కర్రి మల్లేశ్వరరావు పాల్గొన్నారు.