మోదీ పర్యటనపై జేఏసీ నిరసన

ABN , First Publish Date - 2022-07-05T07:12:33+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆపాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది.

మోదీ పర్యటనపై జేఏసీ నిరసన
జగదాంబ జంక్షన్‌లో నిరసన తెలియజేస్తున్న విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌

మహారాణిపేట, జూలై 4: విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆపాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ  డిమాండ్‌ చేసింది.  సోమవారం జగదాంబ జంక్షన్‌లో నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించి, మోదీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  జేఏసీ చైర్మన్‌ జగ్గునాయుడు మాట్లాడుతూ అల్లూరి త్యాగాల మీద బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా  స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, దేశానికి చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌,  కె.మల్లయ్య, పి.వెంకటలక్ష్మి, డి. అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.


Read more