ఆర్టీసీ ఎండీ దృష్టికి సమస్యలు: చల్లా

ABN , First Publish Date - 2022-11-16T02:54:23+05:30 IST

‘‘సెలవులు తీసుకోకుండా సిబ్బంది కష్టపడి పని చేశారు. లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ 2020 నుంచి రావట్లేదు. సుమారు 30 వేల మంది ఇబ్బంది పడుతున్నారు.

ఆర్టీసీ ఎండీ దృష్టికి సమస్యలు: చల్లా

అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘సెలవులు తీసుకోకుండా సిబ్బంది కష్టపడి పని చేశారు. లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ 2020 నుంచి రావట్లేదు. సుమారు 30 వేల మంది ఇబ్బంది పడుతున్నారు. చెల్లించండి’’ అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు పీటీడీ వైఎ్‌సఆర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ విన్నవించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, డీఎస్పీ రావు, జేఎం నాయుడు, అబ్రహాం తదితర రాష్ట్ర నేతలతో కూడిన బృందం ఎండీతో భేటీ అయింది. సమస్యలు పరిష్కరించాలని చంద్రయ్య కోరారు.

Updated Date - 2022-11-16T02:54:23+05:30 IST

Read more