దేశంలో మెరుగుపడిన క్రీడా సదుపాయాలు

ABN , First Publish Date - 2022-08-25T06:09:53+05:30 IST

గతంతో పోల్చితే ప్రస్తుతం దేశంలో క్రీడా సదుపాయాలు చాలావరకు మెరుగుపడ్డాయని, క్రీడల్లో ప్రతిభ చాటాలనుకునేవారు నిజాయితీగా కృషిచేస్తే దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగవచ్చునని భారత హాకీజట్టు మాజీ కెప్టెన్‌ వీరేన్‌ రాన్‌క్విన్హ అన్నారు.

దేశంలో మెరుగుపడిన క్రీడా సదుపాయాలు
భారత హాకీ మాజీ కెప్టెన్‌ వీరేన్‌

భారత హాకీజట్టు మాజీ కెప్టెన్‌ వీరేన్‌

సాగర్‌నగర్‌, ఆగస్టు 24 : గతంతో పోల్చితే ప్రస్తుతం దేశంలో క్రీడా సదుపాయాలు చాలావరకు మెరుగుపడ్డాయని, క్రీడల్లో ప్రతిభ చాటాలనుకునేవారు నిజాయితీగా కృషిచేస్తే దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగవచ్చునని భారత హాకీజట్టు మాజీ కెప్టెన్‌ వీరేన్‌ రాన్‌క్విన్హ అన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘ఛేంజ్‌ మేకర్స్‌’ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అనుసరిస్తే చదువుతోపాటు క్రీడలలో సైతం రాణించవచ్చునని తెలిపారు.


వర్సిటీల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి క్రీడకు తగినంత మంది శిక్షకులు (కోచ్‌) లను సిద్ధంచేసుకుంటే మంచి ఫలితాలు సాధించడం కష్టం కాదన్నారు. తన కుటుంబంలో క్రీడాకారులు ఎవరూ లేకున్నా బాల్యంలో తన పాఠశాల కోచ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడం సూర్తినిచ్చి తాను హాకీ క్రీడలో రాణించి కెప్టెన్‌గా ఎదిగేందుకు దోహదపడిందన్నారు. విద్యార్థులు ప్రతి రోజు 15 నుంచి 30 నిమిషాల పాటు నడక అలవాటు చేసుకోవాలని, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు.  అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

Read more