ఎకరాకు రూ.కోటి ఇస్తేనే..భూములిస్తాం

ABN , First Publish Date - 2022-02-19T06:39:08+05:30 IST

మండలం లోని కాగిత హైవే జంక్షన్‌ నుంచి కాగిత గ్రామం మీదుగా వేంపాడు, అమలాపు రం, పాటిమీద గ్రామాలను కలుపుతూ విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణపై శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు.

ఎకరాకు రూ.కోటి ఇస్తేనే..భూములిస్తాం
ఏపీఐఐసీ ఎస్‌డీసీ అనితకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు, రైతులు

 ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రహదారి కోసం భూ సేకరణపై గ్రామ సభ

  పరిహారం పెంచాలని ఏపీఐఐసీ అధికారులకు తేల్చి చెప్పిన రైతులు

నక్కపల్లి, ఫిబ్రవరి 18 : మండలం లోని కాగిత హైవే జంక్షన్‌ నుంచి కాగిత గ్రామం మీదుగా వేంపాడు, అమలాపు రం, పాటిమీద గ్రామాలను కలుపుతూ విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణపై శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. కాగిత గ్రామంలో  రైతులతో ఏర్పాటైన ఈ సభకు ఏపీఐఐసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనిత హాజరయ్యారు. రహదారి కోసం తమకు జీవనాధారమైన భూములను వదులుకోలేమని కొందరు రైతులు స్పష్టం చేశారు. ఒకవేళ భూములు ఇవ్వాల్సి వస్తే పరిహారం పెంచాలని కోరారు. ఈ రహదారి నిర్మాణానికి అనువైన భూములు కాగిత, వేంపాడు, న్యాయంపూడి గ్రామాలకు చెందిన రైతులవేనని చెప్పారు. అందువల్లే న్యాయంపూడిలో ఉన్న రిజిస్ర్టేషన్‌ వాల్యూ ప్రకా రం ఈ మూడు గ్రామాలను ఒక క్లస్టర్‌గా భావించి, రెండు రెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఎకరానికి సుమారుగా రూ.35 లక్షల నుంచి రూ. 40లక్షలు పరిహారం వస్తుందని అధికారులు చెప్పగా,  రైతులు నిరాకరించారు. కనీసం ఎకరానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా తాము కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో న్యాయంపూడి సర్పంచ్‌ రెడ్డి వర హాలు, కాగిత ఎంపీటీసీ సభ్యుడు ఆకేటి గోవిందరావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, రైతు సంఘం ప్రతినిధులు  గుమ్ముళ్లు గోవింద్‌, వీర బాబు, శివ, అనపర్తి పాండు తదితరులు పాల్గొన్నారు.

Read more