200 మందికి గుండె పరీక్షలు

ABN , First Publish Date - 2022-09-19T06:22:36+05:30 IST

మండలంలోని వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

200 మందికి గుండె పరీక్షలు
ఉచిత వైద్య శిబిరంలో రోగిని గుండె ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్యుడు

సప్పిపుట్టులో టీడీపీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

మెరుగైన వైద్యానికి 12 మంది విశాఖ తరలింపు


పాడేరు రూరల్‌, సెప్టెంబరు 18: మండలంలోని వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. మన్యంలో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి దంపతుల ఈ శిబిరం నిర్వహించారు. విశాఖపట్నం అను హాస్పటిల్‌ వైద్యురాలు (గుండె వైద్య నిపుణులు) డాక్టర్‌.శిరీష 200 మంది రోగులకు గుండె ఆరోగ్య తనిఖీలు చేశారు. వీరిలో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 12 మందిని గుర్తించి వారికి, వైద్య సేవలు అందించేందుకు విశాఖపట్నం తరలించారు. ఈ మెగా వైద్య శిబిరంలో గుండె వైద్య నిపుణులు హేమంత్‌ ప్రవీణ్‌, సుకుమార్‌, భవానీశంకర్‌, స్టాలిన్‌, వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు ఎంవీవీఎస్‌.ప్రసాద్‌, కె.సుబ్బారావు, మర్ల మణి, బాకూరు బాలరాజు, ఎం.వెంకటరావు, ఎం.సిందు, ఎం.కొండబాబు, వంతాల బాలరాజు, గెమ్మెలి బాలన్న, ఎం.కృష్ణ, ఎం.మల్లుదొర పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T06:22:36+05:30 IST