వలంటీర్‌పై లైంగిక వేధింపుల కేసు

ABN , First Publish Date - 2022-11-25T03:46:58+05:30 IST

ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామ సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్న పల్లెపాం నవీన్‌ తనను లైంగికంగా..

వలంటీర్‌పై లైంగిక వేధింపుల కేసు

నూజివీడు టౌన్‌, నవంబరు 24: ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామ సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్న పల్లెపాం నవీన్‌ తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మహిళ నూజివీడు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వలంటీర్‌పై మండల పరిషత్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది. నూజివీడు రూరల్‌ ఎస్‌ఐ తలారి రామకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నవీన్‌ను విధుల నుంచి తొలగించినట్టు నూజివీడు ఎంపీడీవో జి.రాణి గురువారం విలేకరులకు తెలిపారు.

Updated Date - 2022-11-25T03:46:58+05:30 IST

Read more