నేడు జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-03-04T06:17:46+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) వార్షిక బడ్జెట్‌ సమావేశం శుక్రవారం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరగనున్నది.

నేడు జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం

రూ.4,319.98 కోట్లతో ముసాయిదా


విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) వార్షిక బడ్జెట్‌ సమావేశం శుక్రవారం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరగనున్నది. 2022-23 ఆర్థిక సంత్సరానికి రూ.4,319.98 కోట్ల అంచనాతో ముసాయిదా బడ్జెట్‌ను తయారుచేశారు. దీనికి స్టాండింగ్‌ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలపడంతో పాలకవర్గం ఆమోదం కోసం కౌన్సిల్‌లో ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌ అంశాలను మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి సభ్యులకు చదివి వినిపిస్తారు. సభ్యులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు బడ్జెట్‌లో మార్పులు, చేర్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు అధికారులకు మేయర్‌ ఆదేశాలు జారీచేస్తారు. 2022-23 బడ్జెట్‌లో ప్రారంభ నిల్వగా రూ.434.8 కోట్లు చూపించగా, అన్నిమార్గాల నుంచి రూ.3,885.18 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. వివిధ అవసరాలకు కేటాయింపులు కింద రూ.4,061.9 కోట్లు చూపించగా, ముగింపు నిల్వగా రూ.258.08 కోట్లు చూపించారు. 

Read more