-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » GVL fire on YCP Govt anr-MRGS-AndhraPradesh
-
GVL: విశాఖలో భూ కబ్జాలు తప్ప మీరేం చేశారు?..
ABN , First Publish Date - 2022-09-30T21:29:09+05:30 IST
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

విశాఖ (Visakha): బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని.. మంత్రి బొత్స సత్యానారాయణ (Bosta Satyanarayana) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. విశాఖ అభివృద్ధికి ఏం చేశారో మంత్రి చెప్పాలని సవాల్ చేశారు. విశాఖలో భూ కబ్జాలు తప్ప మీరేం చేశారంటూ జీవీఎల్ మండిపడ్డారు. రుషికొండ రిసార్ట్స్ రహస్యమేంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భూములు నిషేధిత జాబితాలో పెట్టి.. అమ్మకాలు జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. లోన్ యాప్స్ (Loan apps) దారుణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య బూతుల పోరు నడుస్తోందని జీవీఎల్ విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి కనీసం బాధ్యత ఉంటే.. తాను చెప్పే అంశాలపై సమీక్ష నిర్వహించి సాధారణ ప్రజలకు న్యాయం చేయాలని జీవీఎల్ కోరారు.