గురుకుల పాఠశాలపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-09-25T07:01:27+05:30 IST

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం తగదని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏర్పాటైన తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో పాఠశాల సిబ్బందిని నిలదీశారు.

గురుకుల పాఠశాలపై నిర్లక్ష్యం తగదు
కమిటీ సమావేశంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు

 అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం

తుమ్మపాల, సెప్టెంబరు 24 :  మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం తగదని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏర్పాటైన తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో పాఠశాల సిబ్బందిని నిలదీశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. విద్యార్థుల సీట్ల పరిమితి సైతం 160 ఉండాల్సి ఉండగా,  ప్రతి ఏటా 40 మాత్రమే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాలలో దోమల సమస్య బెడదపై, పారిశుధ్య సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరాఉ. అనంతరం ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ కర్రి గంగాధర్‌ మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని విరించారు.  

Read more