జీఏపీ సర్టిఫికెట్‌తో పంటకు మంచి ధర

ABN , First Publish Date - 2022-11-25T03:44:27+05:30 IST

పంట ఉత్పత్తులకు మంచి ధర రావాలంటే ఎగుమతుల ప్రమాణాలకు అనుగుణంగా గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌(జీఏపీ) సర్టిఫికెట్‌ ఉండాలని వ్యవసాయశాఖ ...

జీఏపీ సర్టిఫికెట్‌తో పంటకు మంచి ధర

త్వరలో అపెడా ప్రాంతీయ కార్యాలయం: పూనం

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పంట ఉత్పత్తులకు మంచి ధర రావాలంటే ఎగుమతుల ప్రమాణాలకు అనుగుణంగా గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీ్‌స(జీఏపీ) సర్టిఫికెట్‌ ఉండాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆధ్వర్యంలో జీఏపీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌పై గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథి పూనం మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులు పాటించి పండించే పంటకు జీఏపీ సర్టిఫికెట్‌ ఉంటే మంచి ధరకు కొనుగోలు చేసేలా దాదాపు 200 దేశాలతో అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ ఒప్పందం చేసుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుని, విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కోసే వరకు రైతులకు పొలంబడి ద్వారా తగిన శిక్షణ ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జీఏపీ సర్టిఫికెట్‌ జారీకి ఏపీ సీడ్స్‌ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో త్వరలో అపెడా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated Date - 2022-11-25T03:44:55+05:30 IST

Read more