సమరయోధులను స్మరించుకోవడం అదృష్టం

ABN , First Publish Date - 2022-08-10T06:17:42+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులను సత్కరించుకోవడం ఎంతో అదృష్టమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ అన్నారు.

సమరయోధులను స్మరించుకోవడం అదృష్టం
స్వాతంత్య్ర సమరయోధులు గెడ్డం సన్యాసిరావు భార్య కృష్ణవేణిని సన్మానిస్తున్న నగేష్‌ తదితరులు


బీజేపీ యువ సంఘర్షణ యాత్ర ర్యాలీలో తోట నగేష్‌

పాయకరావుపేట, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులను సత్కరించుకోవడం ఎంతో అదృష్టమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం, వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన రాష్ట్రాభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ యువమోర్చా చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర ర్యాలీ మంగళవారం పాయకరావుపేటలో తోట నగేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బృందావనంలో నివాసముంటున్న స్వాత్వంత్య్ర సమరయోధులు దివంగత గెడ్డం సన్యాసిరావు సతీమణి కృష్ణవేణిని నగేష్‌ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గుంటపల్లి నుంచి ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులు గెడ్డం సన్యాసిరావు, నెల్లిమర్ల విజయరామారావు, తోట చిన్నబ్బాయి ఉండడం ఈ ప్రాంతానికే ఎంతో గర్వకారణమన్నారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్‌ ఎం.నాగమల్లేశ్వరి, రవిరాజు, మంచాల శ్రీనివాసగాంధీ, ఇంజరపు సూరిబాబు, ఐ.ఎన్‌.మూర్తి, కువలకుమార్‌, ముక్కడుపల్లి నాగరాజుతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బీజేపీ నాయకులు, పాల్గొన్నారు. 


Read more