అమరుల త్యాగఫలమే స్వేచ్ఛా జీవనం

ABN , First Publish Date - 2022-08-15T06:06:15+05:30 IST

ప్రస్తుతం స్వేచ్ఛా జీవనానికి అమరవీరుల త్యాగ ఫలితమే కారణమని అనకాపల్లి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ పి.కూర్మినాయుడు పేర్కొన్నారు.

అమరుల త్యాగఫలమే స్వేచ్ఛా జీవనం
గంటందొర మనమడు బోడిదొరను సన్మానిస్తున్న పీడీ

అనకాపల్లి హౌసింగ్‌ పీడీ కూర్మినాయుడు


కొయ్యూరు, ఆగస్టు 14: ప్రస్తుతం స్వేచ్ఛా జీవనానికి అమరవీరుల త్యాగ ఫలితమే కారణమని అనకాపల్లి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ పి.కూర్మినాయుడు పేర్కొన్నారు. మండలంలోని నడింపాలెం శివారు లంకవీధిలో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు, అల్లూరి అనుచరుడు గాం గంటందొర మనువడు బోడిదొరను ఆదివారం కలసి ఘనంగా సత్కరించారు. అనంతరం వారి కుటుంబ స్థితిగతులను తెలుసుకుని ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించేందుకు ప్రాణాలు త్యాగం చేసిన యోధులను, వారి కుటుంబాలను మరచిపోకూడదన్నారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ఆగడాలను అడ్డుకునేందుకు పోరాడిన గంటందొర, మల్లుదొరలకు అందరూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎంపీడీవో ఎస్‌.డేవిడ్‌రాజు, పంచాయతీ విస్తరణాధికారి రఘురాం, హౌసింగ్‌ ఏఈ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. 


Read more