పిడుగు పడి నలుగురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-06-12T06:28:28+05:30 IST

మండలంలోని పెదబిడ్డ పంచాయతీ ఊటమామిడి గ్రామంలో శనివారం రాత్రి 7 గంటల శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ గిరిజనుడి ఇంటిపై పిడుగు పడింది.

పిడుగు పడి నలుగురికి తీవ్ర గాయాలు
చికిత్స పొందుతున్న శివాజీ

- ఊటమామిడిలో ఘటన

అనంతగిరి, జూన్‌11: మండలంలోని పెదబిడ్డ పంచాయతీ ఊటమామిడి గ్రామంలో శనివారం రాత్రి 7 గంటల శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ గిరిజనుడి ఇంటిపై పిడుగు పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బిసోయ్‌ శివాజీ అనే గిరిజనుడి ఇంటిపై పిడుగు పడడంతో అతనితో పాటు భార్య సన్యాసమ్మ, వదిన కాసులమ్మ, అతని రెండు నెలల కుమార్తె గౌతమిలు తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రులను బంధువులు, స్థానికులు 108 వాహనంలో ఎస్‌కోట సీహెచ్‌సీకి తరలించారు. సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధితులను జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, కో-ఆప్షన్‌  సభ్యుడు మదీనా పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు.

Read more