-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Forest products should be sold to GCC-NGTS-AndhraPradesh
-
జీసీసీకే అటవీ ఉత్పత్తులు విక్రయించాలి
ABN , First Publish Date - 2022-09-29T05:58:54+05:30 IST
అటవీ ఉత్పత్తులను జీసీసీకే విక్రయిచాలని ఆ సంస్థ ఎండీ జి.సురేశ్‌బాబు ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు.

సంస్థ ఎండీ సురేశ్‌బాబు
జి.మాడుగుల, సెప్టెంబరు 28: అటవీ ఉత్పత్తులను జీసీసీకే విక్రయిచాలని ఆ సంస్థ ఎండీ జి.సురేశ్‌బాబు ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. తొలుత గొందిపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ కాఫీ రైతులతో మాట్లాడారు. కాఫీ, మిరియాలతో పాటు చిరుధాన్యాలు కూడా జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జీసీసీ గోదామును సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుని పరిశీలించారు. ఆయన వెంట జీసీసీ డీఎం కురుసా పార్వతమ్మ, బ్రాంచి మేనేజర్ బి.కొండన్న, గోదాము ఇన్‌చార్జి పి.సింహాచలం, సిబ్బంది నాగేశ్వరరావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.