చిన్న పరిశ్రమలకు రూ. 50 లక్షల వరకు రుణాలు

ABN , First Publish Date - 2022-12-31T00:26:27+05:30 IST

నిరుద్యోగ యువత ఏర్పాటు చేసుకునే చిన్నతరహా పరిశ్రమలకు రూ. 50 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ డైరెక్టర్‌ పి. కరుణాకర్‌ తెలిపారు.

చిన్న పరిశ్రమలకు రూ. 50 లక్షల వరకు రుణాలు

తగరపువలస, డిసెంబరు 30 : నిరుద్యోగ యువత ఏర్పాటు చేసుకునే చిన్నతరహా పరిశ్రమలకు రూ. 50 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ డైరెక్టర్‌ పి. కరుణాకర్‌ తెలిపారు. తగరపువలసలోని మహాలక్ష్మి ఫంక్షన్‌ హాలులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత సంస్థ ఆధ్వర్యంలో రాయితీ రుణాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద సర్వీసు రంగానికి రూ. 20 లక్షల వరకు రుణం అందిస్తామని చెప్పారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు వీఎస్‌ శర్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీ రుణాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల నోడల్‌ అధికారి డి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అన్ని పత్రాలు సంప్రదిస్తేనే రుణాలు మంజూరు సులభతరం అవుతుందన్నారు. దాడి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తగరపువలస ఎస్‌బీఐ మేనేజరు కృష్ణమూర్తి, యూనియన్‌ బ్యాంకు మేనేజరు ఆలీ, తెలకల కుల సంక్షేమ సంఘం సభ్యులు జామి అప్పలరాజు, నేరెళ్ల అప్పలనారాయణ, వీరవిల్లి పెదబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:26:27+05:30 IST

Read more