నవజీవన్‌ ఎక్స్‌ప్రె్‌సలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-19T02:56:41+05:30 IST

తిరుపతి జిల్లా గూడూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం వేకువజామున నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ప్యాంట్రీ బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది...

నవజీవన్‌ ఎక్స్‌ప్రె్‌సలో అగ్ని ప్రమాదం

అధికారుల అప్రమత్తతతో తప్పిన ముప్పు

గూడూరు, నవంబరు 18: తిరుపతి జిల్లా గూడూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం వేకువజామున నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ప్యాంట్రీ బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే అధికారుల కథనం మేరకు.. అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12655) శుక్రవారం వేకువజామున 2.45 గంటలకు గూడూరు స్టేషన్‌ సమీపంలోకి రాగానే ప్రయాణికుల కోసం ఆహార పదార్ధాలు తయారుచేసే ప్యాంట్రీ బోగీలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు వ్యాపించాయి. గమనించిన సిబ్బంది వెంటనే స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంపై రైలు ఆగిన కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం గంట ఆలస్యంగా రైలు 4.10 గంటలకు చెన్నై బయలుదేరి వెళ్లింది.

Updated Date - 2022-11-19T02:56:42+05:30 IST