తాండవలో సినిమా షూటింగ్‌

ABN , First Publish Date - 2022-10-05T06:10:52+05:30 IST

మండలంలోని తాండవ రిజర్వాయర్‌ సమీపంలో హైస్కూల్‌ పాత భవనాలలో మంగళవారం సినీడైరెక్టర్‌ శ్రీను గవిరెడ్డి సారథ్యంలో షూటింగ్‌ జరిగింది.

తాండవలో సినిమా షూటింగ్‌
షూటింగ్‌లో పాల్గొన్న గిరిజనులు


నాతవరం, అక్టోబరు 4: మండలంలోని తాండవ రిజర్వాయర్‌ సమీపంలో హైస్కూల్‌ పాత భవనాలలో మంగళవారం సినీడైరెక్టర్‌ శ్రీను గవిరెడ్డి సారథ్యంలో షూటింగ్‌ జరిగింది. ఏజెన్సీ ఆసుపత్రిలో గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై చిత్రీకరించారు. సుమారు వంద మంది కళాకారులు పాల్గొన్నారు. కొన్ని సన్నివేశాలను గదులలోకి ఎవరినీ అనుమతించకుండా చిత్రీకరిం చారు. అలాగే తాండవ పరిసర ప్రాంతాలలో ఫైటింగ్‌ సీన్‌లు షూట్‌ చేసేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మూడురోజులపాటు మంగళవారం ఆసుపత్రి సన్నివేశంలో గిరిజనులు క్యూలో కూర్చొని వైద్యం కోసం ఎదురుచూసే సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి జనం ఎక్కువగా తరలివచ్చారు. మంగళవారం ఈ షూటింగ్‌లో సినీనటులు ఆదర్శ బాలకృష్ణ, బెనర్జీ, ప్రభావతి, కంచరపాలెం రాజు, హరపి ఉత్తమన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు. కెమెరామెన్‌ యువరాజ్‌ సన్నివేశాలను షూటింగ్‌ చేశారు. స్థానిక నాయకులు షేక్‌ రజాక్‌, సిద్దాబత్తుల వెంకటరమణ షూటింగ్‌ బృందానికి సహాయపడ్డారు. తాండవలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఆ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు.

Read more