ఎన్‌ఎంఎంఎస్‌ విద్యార్థుల నమోదుకు గడువు పెంపు

ABN , First Publish Date - 2022-11-03T00:16:01+05:30 IST

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ (ఎన్‌ఎంఎం) స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల పేర్లు పోర్టల్‌లో నమోదు చేసేందుకు ఈనెల 15 వరకు గడుపు పొడిగించారు.

ఎన్‌ఎంఎంఎస్‌ విద్యార్థుల నమోదుకు గడువు పెంపు

ఈనెల 15 వరకు అవకాశం

విశాఖపట్నం, నవంబరు 2: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ (ఎన్‌ఎంఎం) స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల పేర్లు పోర్టల్‌లో నమోదు చేసేందుకు ఈనెల 15 వరకు గడుపు పొడిగించారు. ఈ ఏడాది మార్చి 20న జరిగిన పరీక్షలో పలువురు విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికైన విషయం తెలిసిందే. వీరి వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలని, ఇందుకోసం 15 వరకు గడువును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ సూచించారు. విజేతలు మెరిట్‌కార్డు, ఆధార్‌కార్డుతోపాటు విద్యార్థిపేరు, పుట్టినతేదీ, విద్యార్థి తండ్రిపేరు నమోదు చేయాలని సూచించారు. పుట్టిన తేదీ, తండ్రిపేరు అన్ని ధ్రువపత్రాల్లో ఒకేలా ఉండాలని, లేకుంటే ఎర్రర్‌ మెసేజ్‌ వస్తుందన్నారు. అటువంటి అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో సంప్రదిస్తే వారు విజయవాడలోని ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి పంపే ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇప్పటికే విజవంతంగా నమోదు చేసుకున్నవారు అప్లికేషన్‌ ప్రింట్‌తోపాటు స్టడీ, ఆదా, కుల ధ్రువీకరణ పత్రాలు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేసి జిల్లా నోడల్‌ అధికారి లాగిన్‌ ద్వారా వెరిఫై చేయించుకోవాలని సూచించారు. అలా వెరిఫై చేయించుకున్న వారికి మాత్రమే ఉపకారవేతనం అందుతుందని తెలిపారు.

Updated Date - 2022-11-03T00:16:03+05:30 IST