-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Exciting district level yoga competitions-NGTS-AndhraPradesh
-
ఉత్సాహంగా జిల్లాస్థాయి యోగా పోటీలు
ABN , First Publish Date - 2022-09-11T05:58:39+05:30 IST
మండల కేంద్రం పరవాడలో శనివారం జిల్లాస్థాయి యోగా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. తొలుత ఎంపీపీ పైలా వెంకటపద్మలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.

పరవాడ, సెప్టెంబరు 10 : మండల కేంద్రం పరవాడలో శనివారం జిల్లాస్థాయి యోగా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. తొలుత ఎంపీపీ పైలా వెంకటపద్మలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందరంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు యోగా శక్తివంతంగా పనిచేస్తుందన్నారు. కాగా ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 96 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆరు విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైలా సన్యాసిరాజు, వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు, ఉప సర్పంచ్ బండారు రామారావు, జిల్లా వ్యయామ ఉపాధ్యాయ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఎంవీ నాగేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పిల్లా రవిశంకర్, ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.అన్నాజీరావు, కోశాధికారి లోవరాజు, రెడ్డి శ్రీను, చల్లా కనకారావు తదితరులు పాల్గొన్నారు.