-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Efforts should be made to solve social problems-NGTS-AndhraPradesh
-
సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-02-19T06:05:26+05:30 IST
సామాజిక సమస్యల పరిష్కారానికి, ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి విద్యాలయాలు కృషి చేయాలని ఏయూ రిజిస్ర్టార్ వి.కృష్ణమోహన్ పిలుపునిచ్చారు.

ఏయూ రిజిస్ర్టార్ వి.కృష్ణమోహన్
వెంకోజీపాలెం, ఫిబ్రవరి 18: సామాజిక సమస్యల పరిష్కారానికి, ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి విద్యాలయాలు కృషి చేయాలని ఏయూ రిజిస్ర్టార్ వి.కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. ఏయూ హెచ్‌ఆర్‌డీ అకడమిక్ స్టాఫ్ కళాశాలలో ఏయూ జాతీయ సేవా సంస్థ, ఎంప్యానల్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అండ్ యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక కార్యక్రమాల్లో ప్రోగ్రామ్ అధికారాలు ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. గ్రామాల్లో అనేక సమస్యలు తాండవిస్తుం డడంతో ప్రజలు పట్టణాలకు వలస వస్తున్నారని, దీనివల్ల నగరాల్లో మురికివాడలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ సేవా పథకం ఐటీఐ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రామచంద్రరావు మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకొన్న అంశాలను ప్రోగ్రామ్ అధికారులు వలంటీర్లకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎన్‌ఏడీ పాల్, జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఈపీఎస్ భాగ్యలక్ష్మి, జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.ప్రసాద్, డాక్టర్ ఎస్.హరనాథ్, దీక్షిత, తదితరులు పాల్గొన్నారు.