47,775 మందికి విద్యా దీవెన

ABN , First Publish Date - 2022-11-30T23:44:31+05:30 IST

విద్యా దీవెన’ పథకం జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి జిల్లాలోని 47,775 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో బుధవారం రూ.32,35,09,615 జమ అయ్యాయి.

47,775 మందికి విద్యా దీవెన
లబ్ధిదారులకు చెక్‌ అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్సీలు కల్యాణి, రవీంద్రబాబు, వైసీపీ నేత కేకే రాజు

జిల్లాకు రూ.32.35 కోట్లు

మహారాణిపేట, నవంబరు 30: ‘విద్యా దీవెన’ పథకం జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి జిల్లాలోని 47,775 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో బుధవారం రూ.32,35,09,615 జమ అయ్యాయి. ఈ మేరకు కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు ప్రజా ప్రతినిదులతో కలసి మెగా చెక్‌ను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పథకం లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సచివాలయ సిబ్బందిని సంప్రతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కలాణి, పండుల రవీంద్రబాబు, వైసీపీ నాయకులు కేకే రాజు, పిల్లి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:44:33+05:30 IST