-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Durga Gayatri Shaktipeeth Mata Bharati Sivaikyam-NGTS-AndhraPradesh
-
దుర్గా గాయత్రి శక్తిపీఠం మాత భారతి శివైక్యం
ABN , First Publish Date - 2022-02-23T06:00:32+05:30 IST
భీమిలిలోని దుర్గా గాయత్రి శక్తిపీఠం మాత గోర్ల భారతి శివైక్యం పొందారు.

భీమునిపట్నం, ఫిబ్రవరి 22: భీమిలిలోని దుర్గా గాయత్రి శక్తిపీఠం మాత గోర్ల భారతి శివైక్యం పొందారు. భీమిలిలోని కుమ్మరిపాలెంలో 1999 ఆగస్టు ఎనిమిదిన ఆమె శ్రీదుర్గా గాయత్రి శక్తి పీఠాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో త్రిపద గాయత్రీదేవిని ప్రతిష్టించి ఎంతోమంది ఆధ్యాత్మికప్రియులకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడంతో పాటు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేవారు. ఆమె హనుమంతు సుందరరావు, సత్యవతమ్మ దంపతులకు 1946 జూన్ 24న జన్మించారు. ఆమె భర్త.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ జి.చంద్రశేఖరం ప్రతీ ఆదివారం ఈ పీఠంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు మందులు పంపిణీ చేసేవారు. సుదూర ప్రాంతాల నుంచి ఆధ్యాత్మికవాదులు, సందర్శకులు విచ్చేసి భారతిని కలవడంతో పాటు త్రిపద గాయత్రీదేవిని దర్శించేవారు. ఒకటి, రెండు రోజులు పీఠంలో ప్రశాంతంగా గడపాలనుకునే భక్తులకు ఉచితంగా వసతి సౌకర్యం కూడా కల్పించేవారు. భారతి శివైక్యం కావడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.