దువ్వాడ రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

ABN , First Publish Date - 2022-10-05T06:34:55+05:30 IST

దువ్వాడ రైల్వే స్టేషన్‌ను డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో పర్యటిస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి

కూర్మన్నపాలెం, అక్టోబరు 4: దువ్వాడ రైల్వే స్టేషన్‌ను డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దువ్వాడ రైల్వే యూజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల వినతి మేరకు ఆయన రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులను కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన పరిపాలన భవనం, ప్లాట్‌ఫారాలు, ఎన్టీపీసీ రైల్వే ట్రాక్‌ వంతెన, జీఆర్పీఎఫ్‌ సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. కాలినడక వంతెన మీదుగా 4వ ఫ్లాట్‌ఫారమ్‌ నుంచి 1వ ఫ్లాట్‌ఫారమ్‌కు వచ్చి తనిఖీలు చేపట్టారు. రైలు ప్రయాణికుల నుంచి ఆటోడ్రైవర్లు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. ప్లాట్‌ఫారమ్‌-1 వైపు బస్సుల ఏర్పాట్లు, లిఫ్ట్‌ ప్రతిపాదనలను పరిశీలించారు. రైలు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని స్టేషన్‌ సిబ్బందికి సూచించారు. డీఆర్‌ఎం వెంట ఏఆర్‌డీఎం, సీనియర్‌ డివిజినల్‌ ఇంజనీర్‌, సీనియర్‌ డివిజినల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌, సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌, దువ్వాడ రైల్వే యూజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కంచుమూర్తి ఈశ్వర్‌, ఆర్‌.రవిబాబు తదితరులు పాల్గొన్నారు. 


Read more