జిల్లా అటవీ అధికారులు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-09-29T06:47:48+05:30 IST

అనకాపల్లి జిల్లా అటవీ శాఖ (సామాజిక) అధికారిగా జి.లక్ష్మణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా అటవీ అధికారులు బాధ్యతల స్వీకరణ
అనకాపల్లిలో బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్‌

  అనకాపల్లిలో లక్ష్మణ్‌, నర్సీపట్నంలో అనంత్‌ శంకర్‌...

కొత్తూరు (అనకాపల్లి), సెప్టెంబరు 28: అనకాపల్లి జిల్లా అటవీ శాఖ (సామాజిక) అధికారిగా  జి.లక్ష్మణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో మాడుగుల, చోడవరం, బుచ్చెయ్యపేట, వెంకన్నపాలెం, ఎలమంచిలి, కోటవురట్ల, పాయకరావుపేట, పూడిమడక ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల మేర రిజర్వు ఫారెస్టు ఏరియా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, చెరువు గట్లు, రహదారుల పక్కన మొక్కలు నాటేందుకు ప్రజలను ప్రోత్సహిస్తామని, మొక్కల పరిరక్షణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

 నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా అటవీ శాఖ (టెరిటోరియల్‌) అధికారిగా విశాఖపట్నం డీఎఫ్‌వో అనంత్‌ శంకర్‌ అదనపు బుధవారం నర్సీపట్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం, కృష్ణాదేవిపేట రేంజర్లు లక్ష్మీనర్సు, ఎస్‌.వెంకటరావు, పలువురు అధికారులు, ఆయనను మర్యాదపూర్వంగా కలిశారు.

Read more