జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2022-04-24T07:03:07+05:30 IST

విశాఖ జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం నగరంలో జరిగాయి

జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఏప్రిల్‌ 23: విశాఖ జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం నగరంలో జరిగాయి. నూతన అధ్యక్షుడిగా కొసరాజు గోపాలకృష్ణ, కార్యదర్శిగా ఎం.గణేష్‌రావు, కోశాధికారిగా కె.ధనరాజు, ఉపాధ్యక్షులుగా  అత్తిలి జగన్నాఽథరావు, వి.శివప్రసాద్‌, హెచ్‌ఎం పాత్రో, సంయుక్త కార్యదర్శులుగా కె.అప్పన్న, సీహెచ్‌.సత్తిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి కేవీఆర్‌కే రవీంద్రకుమార్‌ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో  14 క్లబ్‌లకు చెందిన ప్రతినిధులు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. అనంతరం నూతన అధ్యక్షుడు కొసరాజు మాట్లాడుతూ  744/08 రిజిస్ర్టేషన్‌ నంబరు కలిగిన విశాఖపట్నం జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రెన్యువల్‌ పెండింగ్‌లో వుందని, అయితే అదే పేరుతో ఎన్నికలు నిర్వహించాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. కాగా ఎన్నికల పర్యవేక్షకులను నియమించాలని కోరుతూ  శాప్‌  వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌తోపాటు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌కు, జిల్లా ఒలింపిక్‌ సంఘం, రిజిస్ర్టార్‌ ఆఫ్‌ సొసైటీకి లేఖలు రాసినా హాజరుకాలేదని తెలిపారు. 


Read more