విబ్రాంత్‌ డైట్‌-2022 పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-11-23T00:54:05+05:30 IST

స్థానిక డైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం విబ్రాంత్‌ డైట్‌-2022 పోస్టర్‌ను కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ ఆవిష్కరించారు.

విబ్రాంత్‌ డైట్‌-2022 పోస్టర్‌ ఆవిష్కరణ
పోస్టర్‌ ఆవిష్కరించిన రత్నాకర్‌

అనకాపల్లి టౌన్‌, నవంబరు 22 : స్థానిక డైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం విబ్రాంత్‌ డైట్‌-2022 పోస్టర్‌ను కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ ఆవిష్కరించారు. డిసెంబరు 12, 13 తేదీల్లో జరగబోయే కాలేజీ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని రత్నాకర్‌ పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం విబ్రాంత్‌ డైట్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, వివిధ విభాగాల అధిపతులు, డైట్‌ వలంటీర్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:54:05+05:30 IST

Read more