-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Delhi Deputy Chief Minister Manish Sisodia visits Geetham Varsity-NGTS-AndhraPradesh
-
గీతం వర్సిటీ సందర్శించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
ABN , First Publish Date - 2022-04-24T05:48:13+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 23: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. గీతం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీభరత్, ఎం.భరద్వాజ, ప్రొవైస్ చాన్సలర్ ఆచార్య గీతాంజలి, రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేంజ్ మేకర్స్ పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన తన జీవన ప్రయాణంలో పాత్రికేయుడిగా, కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా తన అనుభవాలను వివరించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సిసోడియాను గీతం అధ్యక్షుడు శ్రీభరత్ ఘనంగా సత్కరించారు.