పరిపాలనా సౌలభ్యానికే వికేంద్రీకరణ

ABN , First Publish Date - 2022-10-02T06:29:42+05:30 IST

వికేంద్రీకరణ అంశంపై పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపం ఆవరణలో శనివారం ఎమ్మెల్యే కన్నబాబురాజు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటైంది. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి, ఎంపీపీ బోదెపు గోవింద్‌, కొందరు న్యాయవాదులు, విద్యా సంస్థల, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పలువురు స్థానికులు హాజరయ్యారు.

పరిపాలనా సౌలభ్యానికే వికేంద్రీకరణ
విలేఖర్లతో మాట్లాడుతున్న కరణం ధర్మశ్రీ, చిత్రంలో ఎమ్మెల్యే కన్నబాబు


రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే కన్నబాబురాజు వెల్లడి

  ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలతో మద్దతుగా నిలుస్తామన్న పలువురు స్థానికులు 

ఎలమంచిలి, అక్టోబరు 1 : వికేంద్రీకరణ అంశంపై పట్టణంలోని  వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపం ఆవరణలో శనివారం      ఎమ్మెల్యే కన్నబాబురాజు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటైంది. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి,  ఎంపీపీ బోదెపు గోవింద్‌,  కొందరు న్యాయవాదులు, విద్యా సంస్థల, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పలువురు స్థానికులు హాజరయ్యారు. వికేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని, విశాఖకు ఆర్థిక రాజధాని వస్తే మరింత అభివృద్ధి చెందే అవ కాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలతో మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టే వికేంద్రీకరణతో భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ యు.సుకుమారవర్మ,  చైర్‌పర్సన్‌ రమాకుమారి, ఎంపీపీ గోవింద్‌, వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, అర్రెపు గుప్తా, వైసీపీ మండల అధ్యక్షుడు కొల్లి త్రినాథ్‌, వైసీపీ నాయకులు అభిప్రాయాలను తెలిపారు. న్యాయవాదులు వెంకట్రావు, కూనిశెట్టి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 అన్ని నియోజకవర్గాల్లో   సమావేశాలు : ధర్మశ్రీ

 వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో  రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ తెలిపారు.  ఎలమంచిలిలో జరిగిన  సమావేశం అనంతరం ఇక్కడికి విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు.  వికేంద్రీకరణకు మద్దతుగా అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. 

Updated Date - 2022-10-02T06:29:42+05:30 IST