సమస్యలు పరిష్కరించాలని డీలర్ల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-05T06:54:00+05:30 IST

సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రేషన్‌ డీలర్లు ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు కొప్పాక శేషు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల వల్ల రేషన్‌ డీలర్ల ఆదాయ భద్రతకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు.

సమస్యలు పరిష్కరించాలని డీలర్ల ఆందోళన
4పీవీడీ1 : పరవాడలో సమస్యలపై నినాదాలు చేస్తున్న డీలర్లు

సబ్బవరం, జూలై 4 :  సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రేషన్‌ డీలర్లు ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు కొప్పాక శేషు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల వల్ల రేషన్‌ డీలర్ల ఆదాయ భద్రతకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. డోర్‌ డెలివరీ విధానం వచ్చిన తరువాత ఎండీయూలకు జీతం, హమాలీ ఖర్చులు, పెట్రోలు ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తున్నా, డీలర్లు మాత్రం తమకు వచ్చిన కమిషన్‌లోనే ఖర్చులు భరించాల్సి రావడం విచా రకరమన్నారు. అనంతరం ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జూనియర్‌ అసిస్టెంట్‌ డి.నాగభూషణంకు అందజేశారు. ఈ కార్యక్ర మంలో పాపాన ఎల్లాజీ నాయుడు, బోకం రామా రావు, జక్కాన మూలినాయుడు, కైకాల సన్యాసి రావు, విరోతి వాసుదేవరావు, బోకం వెంకటరావు, డీవీఎస్పీ నాయుడు పాల్గొన్నారు. 

ఎలమంచిలి : రేషన్‌ డీలర్లు ఎదుర్కొం టున్న సమస్యలను సోమవారం తహసీల్దార్‌ రాణి అమ్మాజీకి దృష్టికి డీలర్ల సంఘం ప్రతి నిధులు తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వాలు తీసుకువస్తున్న మార్పుల వల్ల డీలర్లకు ఎటువంటి భద్రతకు  లేకుండా పోయిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిని అందజేశారు. నాయకులు ఈశ్వరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

మునగపాక : సమస్యలపై తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రేషన్‌ డీలర్లు సోమవారం ధర్నా చేశారు. అనంతరం ఆర్‌ఐ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. డీలర్లు అచ్చియ్యనాయుడు, వేణుగోపాల్‌, మణికంఠ, లీలావతి, గణేష్‌, భార్గవ తదితరులు పాల్గొన్నారు.

పరవాడ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలో గల రేషన్‌ డీలర్లు  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి గొరుపూటి చంద్రరావు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల వల్ల రేషన్‌ డీలర్లకు కొన్ని ఇబ్బందులు ఎదుర వుతున్నట్టు చెప్పారు.  అనంతరం డీటీ వరహాలకు వినతి పత్రం అందజేశారు. డీలర్ల సంఘం ప్రతినిధులు కట్టుమూరి రాజు, ఎస్‌.సోమేశ్వరరావు, బండారు సత్యనారాయణ, పోతల అప్పలనాయుడు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

Read more