విపత్తుల కారణంగా 3,282 రహదారులకు నష్టం

ABN , First Publish Date - 2022-04-24T06:41:25+05:30 IST

తుఫాన్లు, వివిధ విపత్తుల కారణంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 9,227 కిలోమీటర్ల మేర 3,282 రహదార్లు దెబ్బతిన్నట్టు గుర్తించామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ బి.సుబ్బారెడ్డి తెలిపారు.

విపత్తుల కారణంగా 3,282 రహదారులకు నష్టం
మంత్రి ముత్యాలనాయుడును కలిసిన పీఆర్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ సుబ్బారెడ్డి తదితరులు

 మరమ్మతుకు ప్రతిపాదనలు 

 ‘మాడుగుల’లో అభివృద్ధి పనుల నాణ్యత భేష్‌ : పీఆర్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ సుబ్బారెడ్డి 

దేవరాపల్లి/చీడికాడ/ మాడు గుల, ఏప్రిల్‌ 23 : తుఫాన్లు, వివిధ విపత్తుల కారణంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 9,227 కిలోమీటర్ల మేర 3,282 రహదార్లు దెబ్బతిన్నట్టు గుర్తించామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ బి.సుబ్బారెడ్డి తెలిపారు. వీటిపై తారు రోడ్లు వేసేందుకు రూ.1072.91 కోట్ల వ్యయం ఖర్చు కాగలనుం దన్నారు. ఇందుకు సంబంధించిన అం చనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మాడుగుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న పనులను శనివారం పరిశీలించారు. తొలుత  దేవరాపల్లి మండ లం తారువ క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడును మర్యాదపూర్వ కంగా కలుసుకున్నారు.  అనంతరం తారువ, పెదనందిపల్లి గ్రామాల్లో నిర్మాణ పనులు పరిశీలించి విలేఖర్లతో మాట్లాడారు. మాడుగుల నియోజక వర్గంలో అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో జరిగాయని, ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో చేపట్టే విధం గా కృషి చేస్తామని తెలిపారు. బూడి ముత్యాలనాయుడు పర్యవేక్షణలో చేప ట్టడం వల్లే పనులు చక్కగా సాగు తున్నట్టు చెప్పారు. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు రూ10,668.5 కోట్లు వ్యయం చేస్తున్న చేస్తున్నట్టు చెప్పారు. వాటి వివరాలను వెల్లడించారు. ఈఈ ఎస్‌. సంపత్‌కుమార్‌, డీఈఈలు టి.రమణ, వి.వెంకటరావు, ఏఈఈలు ఉమామహేశ్వరరావు, పి.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే, చీడికాడ మం డలం జె.బి.పురంలో సచివాలయ భవన నిర్మాణ పనులను సుబ్బారెడ్డి పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఈ పార్థసారథి, డీఈ రమణ, ఏఈలు పరదేశినాయుడు, బండారు బాలాజీ అప్పారావు, చిట్టిబాబు, వైసీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజ బాబు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా, మాడుగుల సాగరం రోడ్డును, వంతెన నిర్మాణం చేపట్టాల్సిన తాచేరు కాలువను ఏపీ ఇంజనీరింగ్‌ చీఫ్‌ సుబ్బారెడ్డి బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించి ఎంపీడీవో పోలినాయుడుతో మాట్లాడారు. అంతకముందు మోదకొండమ్మను దర్శించుకు న్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు ఆహ్వానం పలి =కారు. ఎంపీపీ వేమవరపు రామధర్మజ,    మండల పరిషత్‌ జేఈఎం నారాయణరావు, జవ్వాది వరహాలు, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more