సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

ABN , First Publish Date - 2022-08-15T05:37:28+05:30 IST

ఇటివల వివాహమైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ కుమారుడు సూర్య దంపతులను ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16న మర్రిపాలెంలో గల ఆయన నివాసానికి రానున్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
అధికారులకు సూచనలిస్తున్న సీపీ శ్రీకాంత్‌, జేసీ విశ్వనాథన్‌

మర్రిపాలెం, ఆగస్టు 14: ఇటివల వివాహమైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ కుమారుడు సూర్య దంపతులను ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16న మర్రిపాలెంలో గల ఆయన నివాసానికి రానున్నారు. ఈ నేపఽథ్యంలో ఆదివారం నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌. శ్రీకాంత్‌ మర్రిపాలెంలోని గణేశ్‌కుమార్‌ నివాసానికి వచ్చి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం అధికారులకు భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ కె.విశ్వనాథన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Read more