మందుగుండు విక్రయ దుకాణాలను పరిశీలించిన సీపీ

ABN , First Publish Date - 2022-10-08T05:53:00+05:30 IST

దీపావళి పండగ దృష్ట్యా గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మందుగుండు విక్రయ దుకాణాలను శుక్రవారం నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పరిశీలించారు.

మందుగుండు విక్రయ దుకాణాలను పరిశీలించిన సీపీ
దుకాణాన్ని పరిశీస్తున్న సీపీ శ్రీకాంత్‌, తదితరులు

గాజువాక, అక్టోబరు 7: దీపావళి పండగ దృష్ట్యా గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మందుగుండు విక్రయ దుకాణాలను శుక్రవారం నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు భద్రతా చర్యలు చేపట్టారా? లేదా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీపీ సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.


Read more