-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Covid vaccine for children 1214 years from today-NGTS-AndhraPradesh
-
నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2022-03-16T05:45:23+05:30 IST
జిల్లాలో 12-14 ఏళ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

జిల్లాకు 1.3 లక్షల డోసుల ‘కార్బీ వ్యాక్స్’
విశాఖపట్నం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 12-14 ఏళ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ వయస్సు పిల్లలు లక్షా 28 వేల మంది వున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయగా...పిల్లలకు మాత్రం కార్బీ వ్యాక్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 1.3 లక్షల డోసులు కేటాయించింది. కొత్త వ్యాక్సిన్ కావడంతో పీహెచ్‌సీల్లో మాత్రమే పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ తరువాత కొంత సమయం వైద్యుల పర్యవేక్షణలో వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.