సమస్యలపై గళమెత్తిన భవన నిర్మాణ కార్మికులు

ABN , First Publish Date - 2022-03-16T05:53:05+05:30 IST

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులు అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

సమస్యలపై గళమెత్తిన భవన నిర్మాణ కార్మికులు
కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న భవన నిర్మాణ కార్మికులు

ఉద్యోగులను అడ్డుకోవడంతో అరెస్ట్‌ చేసిన పోలీసులు

అక్కయ్యపాలెం, మార్చి 15: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులు అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్మిక శాఖ ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్‌ అయిన వారిలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు, తదితరులున్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ఏళ్లుగా క్లైమ్స్‌ పరిష్కారం కాకపోవడం, గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం, స్కాలర్‌షిప్స్‌, మెటర్నిటీ బెనిఫిట్స్‌ అమలు చేయకపోవడంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  

Read more