కాలుష్యం తగ్గించేలా డ్రెడ్జర్ల నిర్మాణం

ABN , First Publish Date - 2022-09-30T06:18:15+05:30 IST

కార్బర్‌ వ్యర్థాలు తగ్గించేలా నూతన డ్రెడ్జర్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఎండీ, సీఈఓ కెప్టెన్‌ దివాకర్‌ వివరించారు.

కాలుష్యం తగ్గించేలా డ్రెడ్జర్ల నిర్మాణం
డీసీఐ ఎండీ దివాకర్‌ను సన్మానిస్తున్న గంగవరం పోర్టు ప్రతినిధి

 డీసీఐ ఎండీ, సీఈఓ దివాకర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కార్బర్‌ వ్యర్థాలు తగ్గించేలా నూతన డ్రెడ్జర్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఎండీ, సీఈఓ కెప్టెన్‌ దివాకర్‌ వివరించారు. గంగవరం పోర్టులో ’ప్రపంచ మేరిటైమ్‌ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన డ్రెడ్జింగ్‌ పరిశ్రమలో అధునాతన పోకడలు వివరించారు. ఇండియన్‌ షిప్పింగ్‌ రిజస్ట్రార్‌ ప్రతినిధి కుమార్‌ అమేయ, హార్బర్‌ మాస్టర్‌ రాజేశ్‌ ప్రకాశ్‌ తదితరులు ప్రసంగించగా, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గంగవరం పోర్టు సీఈఓ అవినాశ్‌రాయ్‌ యారాడ బీచ్‌ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం ఆహుతులను సన్మానించారు.   


Updated Date - 2022-09-30T06:18:15+05:30 IST