-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Congratulations to the World Chess Boxing Champion-NGTS-AndhraPradesh
-
వరల్డ్ చెస్ బాక్సింగ్ విజేతకు అభినందన
ABN , First Publish Date - 2022-08-17T06:24:25+05:30 IST
: వరల్డ్ కప్ చెస్ బాక్సింగ్ టోర్నీలో నగరానికి చెందిన దండు సహార సాగర్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. హౌరాలో జరిగిన ఈ చాంపియన్‌షిప్ టోర్నీలో సహార సాగర్ 43 కిలోల విభాగంలో అద్భుతంగా రాణించి స్వర్ణ పతకం సాధించింది.

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 16: వరల్డ్ కప్ చెస్ బాక్సింగ్ టోర్నీలో నగరానికి చెందిన దండు సహార సాగర్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. హౌరాలో జరిగిన ఈ చాంపియన్‌షిప్ టోర్నీలో సహార సాగర్ 43 కిలోల విభాగంలో అద్భుతంగా రాణించి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా డీఆర్ఎం అనూప్‌కుమార్ శెత్పతీ, వాల్తేరు డివిజన్ మహిళా సంక్షేమ సంఽఘం అధ్యక్షరాలు పారిజాత శెత్పతీ మంగళవారం సహార సాగర్‌ను అభినందించారు. వాల్తేరు డివిజన్లో టీటీఈగా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న సహార సాగర్ తండ్రి దండు కిరణ్ సాగర్ అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కావడంతో డీఆర్ఎం శెత్పతీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.