-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Complaint to Chairman of ST Commission on the behavior of ITDA PO-NGTS-AndhraPradesh
-
ఐటీడీఏ పీవో తీరుపై ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-08-15T06:07:11+05:30 IST
ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తీరు బాగులేదని ఎస్టీ కమిషన్ సభ్యురాలు జంపరంగి లిల్లీ, వైసీపీ విద్యార్థి విభాగం నేత టి.సురేశ్‌కుమార్ ఆరోపించారు.

పాడేరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తీరు బాగులేదని ఎస్టీ కమిషన్ సభ్యురాలు జంపరంగి లిల్లీ, వైసీపీ విద్యార్థి విభాగం నేత టి.సురేశ్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబును ఆదివారం విశాఖపట్నంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ పీవో గిరిజనాభివృద్ధికి ఎటువంటి కృషి చేయకపోగా, గిరిజనుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం నిధులను తన సొంతానికి వ్యయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తీవ్రమైన అవినీతి ఆరోపణులు ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తన సీసీగా కొనసాగించడం, ఇతర ఆరోపణల నేపథ్యంలో పీవో గోపాలక్రిష్ణను సరెండర్ చేయాలని, సీఐడీ విభాగంతో విచారణ జరిపించాలని వారు కోరారు.