హోరాహోరీగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2022-09-28T06:33:24+05:30 IST

ఏకలవ్య పాఠశాలల విద్యార్థుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి.

హోరాహోరీగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
వాలీబాల్‌ పోటీలో తలపడుతున్న విద్యార్థులు

ఉత్సాహంగా తలపడిన విద్యార్థులు


అరకులోయ, సెప్టెంబరు 27: ఏకలవ్య పాఠశాలల విద్యార్థుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అరకులోయ క్రీడా మైదానంలో మంగళవారం రెండో రోజు 17 రకాల వ్యక్తిగత, ఏడు గ్రూపు పోటీలను నిర్వహించారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, జూడో, లాన్‌టెన్నిస్‌, రోప్‌ స్కిప్పింగ్‌, టెబుల్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాస్కెట్‌బాల్‌, పుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, త్రో బాల్‌, ఖోఖో తదితర ఆటల పోటీలలో పలు ప్రాంతాల నుంచి ఏకలవ్య పాఠశాలల విద్యార్థినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలకు ప్రత్యేక పర్యవేక్షకులుగా గురుకుల సొసైటీ నుంచి విచ్చేసిన ట్రైబల్‌ స్పోర్ట్స్‌ అధికారులు శ్యాంసుందర్‌, రఘునాథ్‌తో పాటు రాష్ట్ర స్థాయి ఏకలవ్య ఆటల పోటీలకు అతిథ్యిం వహిస్తున్న అనంతగిరి ఏకలవ్య పాటఠాల ప్రిన్సిపాల్‌ పీఎస్‌ఎన్‌.మూర్తి వ్యవహరించారు. డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, గూడెంకొత్తవీధి, చింతపల్లి తదితర పాఠశాలల ప్రిన్సిపాళ్లు, క్రీడా పాఠశాలల సిబ్బంది పోటీలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన చర్యలు చేపట్టారు.

Read more