కమిషనర్‌ ‘కాఫీ విత్‌ కార్పొరేటర్స్‌’

ABN , First Publish Date - 2022-03-04T06:24:22+05:30 IST

నగరాభివృద్ధికి పాలకవర్గం, అధి కారులు సమష్టిగా ముందడుగువేసి మంచి ఫలితాలు సాధిం చాలన్నది తన అభిమతమని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీ షా అన్నారు.

కమిషనర్‌ ‘కాఫీ విత్‌ కార్పొరేటర్స్‌’
మేయర్‌ హరివెంకటకుమారి, కమిషనర్‌ లక్ష్మీషాతో కార్యక్రమానికి హాజరైన పన్నెండుమంది కార్పొరేటర్లు

ఉత్తరం పరిధిలోని 13 మందితో సమావేశం

సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ

విశాఖపట్నం, మార్చి 3: నగరాభివృద్ధికి పాలకవర్గం, అధి కారులు సమష్టిగా ముందడుగువేసి మంచి ఫలితాలు సాధిం చాలన్నది తన అభిమతమని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీ షా అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు, స్మార్ట్‌సిటీ కీర్తి ప్రతిష్టలు పెంచడం ఇందులో ముఖ్యమన్నారు. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 13 వార్డుల ప్రతినిధులతో గురువా రం ‘కాఫీ విత్‌ కార్పొరేటర్స్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 48ఏ చివరి బస్టాప్‌ సమీపంలోని సామాజిక భవనంలో   ఉదయం 11 గంటలకు  కార్యక్రమం ప్రారంభమైంది.


ముఖ్య అతిథిగా హాజరైన మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం కార్పొరేటర్లు తక్షణ అవసరాలు, సమస్యలను మేయర్‌, కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌ దీపాలు, సామా జిక భవనాల నిర్మాణంతోపాటు సంక్షేమ పథకాలకు ప్రధాన అవసరమైన రేషన్‌ కార్డు సిక్స్‌స్టెప్‌ వెరిఫికేషన్‌ ఆటంకాన్ని దాదాపు కార్పొరేటర్లు అంతా ప్రస్తావించారు. కొందరు కార్పొ రేటర్లు సమస్యలను లిఖిత పూర్వకంగా అందించారు. 


దీనిపై మేయర్‌, కమిషనర్‌ స్పందిస్తూ ప్రాధాన్యతా క్రమం లో సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, పాలక వర్గం ఏర్పాటైన ఏడాది తర్వాత వార్డు ఐదు లక్షలు చొప్పున కేటాయించడంపై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు లక్షలకు సరిపడే పనుల్లేవంటూ, ప్రత్యా మ్నాయ పనులు సూచించారు. 


కాగా, సమావేశం కొంతసేపు అయ్యాక వైసీపీ కన్వీనర్‌ కె.కె.రాజు అనుచరులతో హాజరై కాసేపు ఉన్నారు. ఆయన వచ్చిన సమయంలోనే బీజేపీ కార్పొ రేటర్‌ తన సమస్యలు చెపుతున్నారు. ఆహ్వానంతో బిజీగా ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు తన ప్రసంగాన్ని పట్టించు కోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల లీలావతి (42వ వార్డు), పి.ఉషశ్రీ (43), బానాల శ్రీను (44), కంపాహనోక్‌ (46), కటుమూరి సతీష్‌ (46), కె.కామేశ్వరి (47),   గంకల కవిత (48), ఎ.శంకరరావు (49), వి.ప్రసాద్‌ (50), ఆర్‌.వెంకటరమణ (51),  చల్లా రజని (54), కె.వి.ఎన్‌.శశికళ (55) హాజరయ్యారు. ఆజ్మీర్‌ పర్యటనలో ఉండడంతో 53వ వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ హాజరు కాలేదు.

Read more