టీడీపీ బలోపేతానికి సమష్టి కృషి

ABN , First Publish Date - 2022-03-04T06:06:30+05:30 IST

మన్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు.

టీడీపీ బలోపేతానికి సమష్టి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రావణ్‌కుమార్‌


మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ 

ముంచంగిపుట్టు, మార్చి 3: మన్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఇక్కడ నిర్వహించిన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. పంచాయతీ,  మండల స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి శ్రావణ్‌కుమార్‌ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సివేరి అబ్రహం, జి.రామ్మూర్తి, ఎ.తిరుపతి, కిల్లో బలరామ్‌, కె.జగత్‌రాయ్‌,  కవెర్ల పద్మ, వి. లక్ష్మణ్‌, వి. రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

Read more