విద్య, వైద్య రంగంలో నర్సీపట్నానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-12-31T01:22:41+05:30 IST

. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రాంతంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంలో తమ ప్రభుత్వం చేయనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మారుస్తాయని అన్నారు.

విద్య, వైద్య రంగంలో నర్సీపట్నానికి ప్రాధాన్యం
నర్సీపట్నం బస్టాండ్‌లో పీటీడీ, ప్రైవేటు బస్సులు

ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, వర్సిటీని ఏర్పాటు చేస్తాం

మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల

తాండవ-ఏలేరు అనుసంధానంతో రెండు జిల్లాల రైతులకు మేలు

సీఎం జగన్మోహన్‌రెడ్డి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నర్సీపట్నం, డిసెంబరు 30: A. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రాంతంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంలో తమ ప్రభుత్వం చేయనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మారుస్తాయని అన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు కానున్న వైద్య కళాశాలకు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుందని, నర్సింగ్‌ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే నర్సీపట్నం ప్రాంతీయులకు వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. తాండవ- ఏలేరు రిజర్వాయర్ల అనుసంధానం, కాలువలపై లిఫ్టుల ఏర్పాటు వల్ల అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, కోటవురట్ల, నాతవరం, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు.

సీఎం సభకు బస్సుల్లో జనం తరలింపు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు జనాన్ని తరలించడానికి అధికారులు పీటీడీతోపాటు ప్రైవేటు బస్సులను కూడా పెద్ద సంఖ్యలో వినియోగించారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులను, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను నర్సీపట్నం సభకు తీసుకువచ్చేందుకు ప్రజా రవాణా శాఖకు సంబంధించి 477 బస్సులు, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు చెందిన 230 బస్సులను ఏర్పాటు చేశారు. మాకవరపాలెం మండలం నుంచి 120 బస్సులు, నాతవరం మండలం నుంచి 125 బస్సులు, గొలుగొండ మండలం నుంచి 110 బస్సులు, నర్సీపట్నం మండలం నుంచి 55 బస్సుల్లో జనాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ బస్సులను పట్టణంలోని పలుచోట్ల నిలుపుదల చేయడంతో రహదారులపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. యావత్‌ పోలీసు యంత్రాంగం సీఎం పర్యటన, బహరంగ సభ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమై వుండడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేవారు కరువయ్యారు. కాగా నర్సీపట్నం పీటీడీ డిపోలో 92 సర్వీసులు ఉండగా ఏకంగా 72 సర్వీసులను సీఎం సభజన సమీకరణకు కేటాయించడంతో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గమ్యస్థానాలకు వెళ్లడానికి గంటల తరబడి బస్టాండ్‌లో పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Updated Date - 2022-12-31T01:22:41+05:30 IST

Read more