రాష్ట్రం పరువుతీస్తున్న సీఐడీ అధికారులు

ABN , First Publish Date - 2022-10-03T06:25:24+05:30 IST

వైసీపీకి అనుబంధంగా ఏపీ సీఐడీ అధికారులు పనిచేస్తూ ప్రతిపక్షాలపై దమనకాండ సాగిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆదివారం ఇక్కడ ఆరోపించారు.

రాష్ట్రం పరువుతీస్తున్న సీఐడీ అధికారులు
బుద్ద నాగజగదీశ్వరరావు


- టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌ 

అనకాపల్లి అర్బన్‌, అక్టోబరు 2 : వైసీపీకి అనుబంధంగా ఏపీ సీఐడీ అధికారులు పనిచేస్తూ ప్రతిపక్షాలపై దమనకాండ సాగిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆదివారం ఇక్కడ ఆరోపించారు. ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్‌ ఇంటి వద్ద సీఐడీ అధికారులు హల్‌చల్‌ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి చిన్నపిల్లల్ని భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు పెట్టినా వీరి పనితీరు మాత్రం మారడం లేదని మండిపడ్డారు. గత మూడున్నర సంవత్సరాలుగా సీఐడీ అధికారుల పనితీరు పరిశీలించినట్లైతే తెలుగుదేశం పార్టీ నాయకులపైనా, కార్యకర్తలపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఉందన్నారు. జగన్‌రెడ్డి ఆదేశాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రం పరువుతీస్తున్న ఏపీ సీఐడీ అధికారులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more