-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Chief Minister Jagan goal is selfinterest-NGTS-AndhraPradesh
-
స్వప్రయోజనాలే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం
ABN , First Publish Date - 2022-02-19T06:29:29+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు కన్నా, సొంత ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పర్యటనలో ఈ విషయం తేటతెల్లమయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.

వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయం
సీఎం ఇంటికి భోజనానికి వెళ్లిన ఆరుగురు కేంద్ర మంత్రులు
టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి
మహారాణిపేట, ఫిబ్రవరి 18: ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు కన్నా, సొంత ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పర్యటనలో ఈ విషయం తేటతెల్లమయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఎన్ని డీపీఆర్‌లున్నాయో ముఖ్యమంత్రికి తెలియదన్నారు విశాఖ నుంచి సబ్బవరం, చోడవరం, మల్కన్‌గిరి, సబ్బవరం-షీలానగర్, అచ్యుతాపురం రహదారికి సంబంధించిన డీపీఆర్‌లను పట్టించుకోలేదని, కానీ తాజాగా విశాఖ- భోగాపురం రహదారి కోసం తాపత్రయపడుతున్నారన్నారు. భోగాపురం పరిసరాల్లో జీఎంఆర్ సంస్థ నుంచి 500 ఎకరాలను లాక్కున్నారని, ఆ భూములను మార్కెట్ చేసుకోవడం కోసం ఈ రోడ్డుపై పట్టుబడుతున్నారన్నారు. ప్రజా సంపద పెరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు తపన పడితే, జగన్ సొంత సంపద పెంచుకుంటున్న స్వార్థపరుడన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని, ఇందులో భాగంగానే ఆరుగురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి జగన్ ఇంటికి భోజనానికి వెళ్లారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కేడర్ వైసీపీతో పోరాడుతుంటే, ఆ పార్టీ కేంద్ర పెద్దలు ఇలా అవగాహన రాజకీయాలు నడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా రూ.2 వేల నోట్లు కనిపించడం లేదని, రానున్న ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ దాచిపెట్టిందని ఆరోపించారు.