బొజ్జన్నకొండ రహదారిపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-07-18T06:29:38+05:30 IST

బొజ్జన్నకొండ రహదారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

బొజ్జన్నకొండ రహదారిపై నిర్లక్ష్యం తగదు
బొజ్జన్నకొండ రోడ్డులోని గోతుల వద్ద నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద, టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్సీ బుద్ద

తుమ్మపాల, జూలై 17: బొజ్జన్నకొండ రహదారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ఆదివారం శంకరం - బొజ్జన్నకొండ  రోడ్డులో గల గోతుల్లో నిలిచిన వర్షపునీటిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి గాలాలతో చేపలు పడుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ శతాబ్దం నాటి అవశేషాలున్న బొజ్జన్నకొండపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జూలై 15 నాటికి రాష్ట్రంలో మరమ్మతులకు గురైన రోడ్లన్నీ బాగు చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారని, కానీ ఏ రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుడాల సత్యనారాయణ, పూడి త్రినాథ్‌, మళ్ల గణేష్‌, బొడ్డేడ మురళి, బుద్ద భువనేశ్వరరావు, కాండ్రేగుల ముకుంద, అండిబోయిన శేషు, బీవీవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Read more