GVL Narasimaharao: కేంద్రంపై మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-09-30T18:19:51+05:30 IST

విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

GVL Narasimaharao: కేంద్రంపై మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం

విశాఖపట్నం: విశాఖ అభివృద్ధిని కేంద్రం (central government) అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanaraya) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL narasimha rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖకు అభివృద్ధికి ఏమి చేసారో మంత్రి బొత్స (AP minister)చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘విశాఖ అభివృద్ధికి మీరు చేసింది ఏమిటి? భూ కబ్జాలు తప్ప మరేం చేశారు?. ఈ ప్రాంతాన్ని కూడా తమ కబ్జాలోకి తెచ్చుకోవాలన్న ఏకైక దుగ్ధ తప్ప ఏముంది’’ అని ప్రశ్నించారు. టూరిస్టు కేంద్రమైన విశాఖలో టూరిజం పడుకుందన్నారు. రుషికొండ రిసార్టు రహస్యం ఏమిటి అక్కడ ఏమి కడుతున్నారో బహిర్గతం కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జా సంగతి సరి.. ప్రజల భూములు ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టి అమ్మకాలు జరగకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని ఎంపీ(BJP MP) అన్నారు.


రుణ యాప్‌ల దారుణాలను ఎందుకు అడ్డుకోవటం లేదని నిలదీశారు. వారికి ప్రజాప్రతినిధుల దన్ను ఉందని విమర్శలు వస్తున్నాయని అన్నారు. రుణ యాప్ దారుణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జగన్ సర్కార్ ఒక కమిషన్ వేయాలని... లేదా సీఐడీని వేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య బూతుల పోరు నడుస్తోందని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని ఈ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదని ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-30T18:19:51+05:30 IST