లోన్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-09-13T05:35:10+05:30 IST

రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్‌ యాప్స్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీ కె.ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

లోన్‌  యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న డీఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, సీఐ గణేశ్‌, ఎస్‌ఐలు


ఇన్‌చార్జి డీఎస్‌పీ కె.ప్రవీణ్‌కుమార్‌

నర్సీపట్నం, సెప్టెంబరు 12: రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్‌ యాప్స్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీ కె.ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోన్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం వలన మన సమాచారం మొత్తం యాప్‌ నిర్వాహకులకు తెలిసిపోతుందన్నారు. అధిక వడ్డీలు వసూలు చేయడం, ఈఎంఐలు చెల్లించలేదని వేధింపులకు గురిచేస్తారని తెలిపారు. అనుమతి లేకుండా దీపావళి సామగ్రి నిల్వ చేసినా, తయారు చేసినా నేరమని స్పష్టం చేశారు. లైసెన్స్‌ తీసుకున్న వారు సైతం నిబంధనలు పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు బారిన పడవద్దని సూచించారు. సీల్ట్‌ బెల్ట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్నారు. అనంతరం సీఐ గణేశ్‌, ఎస్‌ఐలు గోవిందరావు, ధనుంజయ నాయుడుతో కలిసి లోన్‌ యాప్స్‌పై అవగాహన కల్పించడానికి పోస్టర్‌ ఆవిష్కరించారు.

Updated Date - 2022-09-13T05:35:10+05:30 IST